Header Banner

పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి..! ఓపెన్ చేసి చూడగా షాక్..!

  Tue May 20, 2025 07:33        Others

అనకాపల్లి జిల్లా  నర్సీపట్నంలో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ లో బైక్‌పై సంచి అనుమానాస్పదంగా కనిపించింది. బైక్ యజమాని సాంబశివరావు తొలుత ఆ సంచి ఎవరైనా ప్రయాణీకులు పెట్టారేమో అనుకున్నాడు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. దీంతో కంగారు వచ్చి సంచిని ఓపెన్ చేశాడు. లోపల్ జీన్ ప్యాంటుతో పాటు ఐదువందల నోట్ల కట్టలు కనిపించాయి. లెక్కించగా లక్ష అమౌంట్ ఉంది. నోట్ల కట్టలతో బ్యాగును సాంబశివరావు పోలీసులకు అందజేశాడు. పోలీసులు వాటిని పరిశీలించి దొంగ నోట్లుగా నిర్ధారించారు. సంచి బైక్‌పై పెట్టిన ఆగంతకుడు కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. దొంగ నోట్ల ముఠా పనా లేక.. ఎవరైనా ఆకతాయిలు ఇలా చేశారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
మాములుగా అయితే పిల్లలు ఆడుకునే తరహా నోట్లు అయితే వాటిపై చిల్డ్రన్ బ్యాంకు అని రాసి ఉంటుంది. కానీ వీటిపై అలా ఏం రాసి లేదు. దీంతో ఇది పక్కాగా దొంగ నోట్ల బ్యాచ్ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులను చూసి ఎవరైనా భయపడి అక్కడ పెట్టి వెళ్లారా..? లేక వేరే ఎవరికైనా అక్కడికి వచ్చి బ్యాగు మర్చిపోయారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.

ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SuspiciousBag #ParkedBikeAlert #PublicSafety #ShockDiscovery #PoliceInvestigation #BreakingNews